Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
లింగోజీ గూడ డివిజన్లో నిర్మిస్తున్న ట్రంక్ లైన్ లెవెల్స్ సక్రమంగా లేకపోవడంతో ట్రంక్ లైన్ పనులు నిలిపివేశారని సామరంగారెడ్డి తెలిపారు. గురువారం లింగోజీ గూడ డివిజన్ సమస్యలపై తపోవనం కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, వడ్డెర బస్తీ, భాగ్యనగర్ కాలనీ లను బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి పాద యాత్ర చేశారు.
ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యంగా తపోవనం కాలనీలోని వరద నీటి కోసమని 84లక్షల రూపాయలతో బాక్స్ టైపు నాలా నిర్మించడం జరిగింది. అయితే సరూర్ నగర్ చెరువు తూము లెవెల్ ప్రకారంగా నిర్మించాల్సిన ట్రంక్ లైన్ను తూము కిందకి నిర్మించారు. దీని వలన ఏ వర్షం వచ్చినా ప్రస్తుతం వున్న చెరువు మట్టానికి 1 మీటర్ ఎత్తు పెరిగితే తపోవనం కాలనీ మొత్తం మునిగిపోయే ప్రమాదం వున్నది. కావున దీనిపై విచారణ జరిపి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు . అదే విధంగా తపోవనం కాలనీలోని రోడ్ల నుండి పోయే వర్షపు నీటిని దారి మళ్లించే కార్యక్రమం ఎక్కడా చేయలేదని, దీని వలన వర్షం నీరు బయటకి వెళ్ళడానికి దారిలేక ఆ నీరంతా కాలనీలలోని ఇళ్లల్లోకి చేరే ప్రమాదం వుంది.
అదే విధంగా పాత ట్రంక్ లైన్లో పేరుకుపోయిన చెత్త చెదారం, మట్టిని తీయవలసిన అవసరం వున్నది, లేనిపక్షంలో ట్రంక్ లైన్లోకి పోయే నీరు తమ ఇళ్లల్లోకి వస్తున్నాయని కాలనీవాసులు బాధను వ్యక్తం చేస్తున్నారని సామ రంగారెడ్డి తెలిపారు. భాగ్యనగర్ కాలనీ ఫేస్-2, రోడ్ నెం: 8లో డ్రైనేజి నీరు బయటకి పోయేదారి మూసుకపోవడం వలన ఆ వీధి రోడ్ మీద సుమారు సంవత్సర కాలం నుండి మురుగు నీరు నిలిచిపోయి వుంది. దీనివలన ఈగలు, దోమలు చేరి పిల్లలు, మహిళలు డెంగ్యూ , మలేరియా, చికెన్గునియా వంటి విష జ్వరాలు బారినపడి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నిత్యం అభివద్ధి, అభివద్ధి అనే టీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాంతంలో తిరిగితే తెలుస్తుందని మండిపడ్డారు. తక్షణమే మున్సిపల్ అధికారులు దీనిపై స్పందిం చాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్రెడ్డి, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్, అఖిల్ పవన్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కష్ణవేణి, కొత్త రవీందర్ గౌడ్ రాములు గౌడ్, గీత రెడ్డి, ప్రవీణ్ గౌడ్, శ్రీనివాస్ గుప్త, ప్రవీణ్ రెడ్డి, కిరణ్ కుమార్, జగదీష్ నాగరాజు, కిషోర్, రషీద్, రాజు పాల్గొన్నారు.