Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
ఇటీవల జరిగిన జీహెచ్ఏంసి ఎన్నికల్లో ఓడిపోయిన అధికార పార్టీ మాజీ కార్పొరేటర్దే డివిజన్లో హవా నడుస్తోంది. హస్తినాపురం మాజీ కార్పొరేటర్ రామవత్ పద్మనాయక్ డివిజన్ పరిధిలో గల సరస్వతినగర్ ఇతర కాలనీలలో జరిగే సీసీ రోడ్డు, డ్రైనేజి పనులను ఏఈ హేము నాయక్‌తో కలిసి పర్యవేక్షిస్తున్న ఫోటోలు సాంఘిక మాద్యమాలలో దర్శనమిస్తున్నాయి. డివిజన్ లో ఎక్కడ అభివద్ధి కార్యక్రమాలు జరిగితే అక్కడ మాజీ కార్పొరేటర్ వుండి అధికారులతో కలిసి ప్రజలకు వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామని చెప్పడం పట్ల గెలిచిన కార్పొరేటర్ ఇవ్వాల్సిన హామీలను మాజీ కార్పొరేటర్ ఇవ్వడం ఏంటని బీజేపీి నాయకులు ప్రశ్నిస్తున్నారు. గెలిచిన హస్తినాపురం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సుజాత నాయక్ మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ ఏ హోదాతో అధికారులను తీసుకొనివెళ్ళి పనులను పర్యవేక్షిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వా మ్యాన్ని గౌరవించని మాజీ కార్పొరేటర్ని, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని వారు హెచ్చరిం చారు. తనకు కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని రోజులుగా హోమ్ క్వారంటైన్లో వున్నానని నవతెలం గాణకు తెలిపారు. ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించిన మాజీ కార్పొరేటర్‌కు పదవిపై వ్యామోహం పోవట్లేదని విమర్శించారు. అదే రీతిలో అధికారులు కూడా సహక రిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్లోని పలు కాలనీల్లో అభివద్ది పనులు మా హయంలోనే మంజూరీ చేయించామని, పనులు ఆలస్యం అవుతుం దని, కాలనీ వాసులు రమ్మంటేనే అక్కడికి వెళ్లానని వారు అన్నారు. గెలిచిన కార్పొరేటర్ ఇన్ని నెలలు గడుస్తున్నా కనీసం ఒక్క కాలనీని సందర్శించి వారి సమస్యలను తెలుసుకోలేదని విమర్శించారు. కేవలం కాలనీ ప్రజల కోరిక మేరకే తాను వెళ్లానని అన్నారు.
ఏఈ హేము నాయక్ వివరణ
ఈ విషయంపై హస్తినాపురం ఏఈ హేము నాయక్‌ని నవతెలంగాణ వివరణ కోరగా అభివద్ధి పనుల విషయంలో ఆలస్యం అవుతుందని ఫిర్యాదులు వస్తే సరస్వతీనగర్ కాలనీకి వెళ్లానని, అదే సమయంలో మాజీ కార్పొరేటర్ వచ్చి ఫోటోలు తీసుకున్నారని తెలిపారు.