Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్‌స్టాగ్రామ్‌లో బంధువుల అమ్మాయికే వేధింపులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
అమ్మాయిలతో న్యూడ్‌గా మాట్లాడే నిందితుడు బంధువుల అమ్మాయినీ వేధింపులకు గురిచేశాడు. సోషల్ మీడియాలో అమ్మాయిలా పరిచయం చేసుకుని న్యూడ్‌గా వీడియోకాల్స్ చేయాలంటూ వేధించిన నిందితుడిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి పోలీసులు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్, అడిషనల్ డీసీపీ డి.శ్రీనివాస్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. కృష్ణాజిల్లా, పామూరుకు చెందిన పి.సోమేంద్ర సాయి స్థానికంగా ఉన్న సంద్యా అక్వా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బంధువువైన ఓ అమ్మాయికి చెందిన ఇన్స్టాగ్రామ్ ఐడీనీ తస్కరించాడు. ఆ తర్వాత నిందితుడు అమ్మాయి ఫోటోతో నకిలీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లు తెరిచాడు. బాధితురాలికి ఫ్రెండ్ రెక్వెస్ట్ పంపించాడు. కొద్దిరోజుల తర్వాత న్యూడ్‌గా వీడియో కాల్ చేయాలని కోరాడు. అయితే అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె సెల్‌ఫోన్‌కు అస్యభ్యకరమైన చిత్రాలు, వీడియోలను పంపించాడు. బాధితురాలు వెంటనే ఆ నెంబర్లను బ్లాక్ చేయడంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఐడీనీ మార్చేసింది. దాంతో వేరే నెంబర్లతో ఫోన్లు చేయడం, నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లతో వేధించడం మొదలు పెట్టాడు. రోజురోజుకూ నిందితుడి వేధింపులు అధికం కావడంతో బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అడిషనల్ డీసీపీ డి.శ్రీనివాస్ ఆదేశాలతో, ఏసీపీ ఎస్.హరినాథ్ సూచనలతో ఇన్స్పెక్టర్ ఎం.శంకర్ విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారించిన సీఐ నిందితుడిని అరెస్టు చేశారు. పక్కాగా సాక్ష్యాధారాలను సేకరించడంతో సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.