Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్
నవతెలంగాణ-కేపీహెచ్బీ
మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులను కూడా పీఆర్సీ పరిధిలోకి తీసుకోవాలని మేడ్చల్ జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్ సుందరయ్య భవన్లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ కమిటీ సమావేశం ఎన్.నర్సమ్మ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ నిర్ణయం మేరకు మినిమం బేసిక్నే మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనంగా చెల్లించాలన్నారు. పారిశుధ్యం పార్కులు, హరితహరం కార్మికులకు నెలకు రూ.19 వేలు. డ్రైవర్లు, జవాన్లు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రీషియన్లకు రూ.22,900, కంప్యూటర్ అపరేటర్లు, బిల్ కలెక్టర్సు, వర్క్ ఇన్స్పెక్టర్లకు 31,040 చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ ఉద్యోగులకు ప్రకటించిన మాదిరిగా మున్సిపల్ కార్మికులకు కూడా 12 నెలల ఎరియర్స్ నగదు రూపంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. కార్మికులందరికీ 15 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులపై అధికారులు వేధింపులు అరికట్టే విధంగా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పీఆర్సీ కమిషన్ నిర్ణయించిన డిమాండ్స్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి పి.పెంటయ్య, యూనియన్ మండల నాయకులు వెంకన్న, సత్యనారాయణ, చెన్నయ్య, నరసమ్మ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.