Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
వైశ్య వ్యాపార వర్గాల అభివృద్ధి మనందరి లక్ష్యం కావాలని వైశ్య బిజినెస్ నెట్వర్క్ (వీబీఎన్) డైమండ్ చాప్టర్ సభ్యులు స్పష్టం చేశారు. శుక్రవారం ఓ ప్రయివేట్ హోటల్లో వీబీఎన్ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈసమావేశంలో ప్రధానంగా తమ వ్యాపార రంగాల అభివద్ధి కోసం ఒకరికొకరు సహకారం అందించాల్సిన తీరు తదితర అంశాలపై చర్చించారు. వైశ్య బిజినెస్ నెట్వర్క్ ద్వారా వైశ్య వ్యాపార వర్గాల అభివద్ధియే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలని తీర్మానించారు. అనంతరం 2021-22 వైశ్య బిజినెస్ నెట్వర్క్ డైమండ్ చాప్టర్ లీడర్ షిప్ టీంను ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా బూరుగు హరికిషన్, కార్యదర్శిగా సంపత్ ప్రొద్దటూరి, కోశాధికారిగా శిరీష తర్లపల్లిని ఎన్నుకున్నారు. వైశ్యా బిజినెస్ నెట్ వర్క్ డైమండ్ చాప్టర్లో సభ్యత్వం తీసుకోవాలి అనుకునే వారు 9246504935 నంబర్లో సంప్రదించాలని వీబీఎన్ ప్రతినిధి సంపత్ వేద విజ్ఞప్తి చేశారు.