Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.20 వేల జరిమానా విధించిన కోర్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఎల్బీనగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. శుక్రవారం రాచకొండ సీపీ మహేష్భగవత్ తెలిపిన వివరాల మేరకు వనస్థల్లిపురంకు చెందిన ఓ మైనర్ ఆస్పత్రికని 2015, సెప్టెంబర్ 29న వెళ్లింది. అయితే అర్ధరాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది లావుండగా అదే ప్రాంతానికి చెందిన అంజనేయులు అనే యువకుడు కనిపించకుండా పోయాడు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే అదే ఏడాది అక్టోబర్ 1న బాలిక తిరిగి ఇంటికి చేరుకుంది. అంజనేయులు అనే నిందితుడు తనను కిడ్నాప్ చేసి బంధించాడాని, తనపై పలు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఎంతో కష్టంతో అతని నుంచి తప్పించుని వచ్చినట్టు పోలీసులకు వివరించింది. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కోర్టులో పక్కాగా సాక్ష్యాలను ఇన్స్పెక్టర్ బి.పుష్పాన్ కుమార్ సమర్పించాడంతో నిందితునికి యావజీవ జైలు శిక్షతోపాటు రూ.20వేల జరిమానా విధించారని సీపీ తెలిపారు.