Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొవిడ్ నిబంధనకు లోబడి రైళ్లు సాధారణంగా నడుస్తున్నాయి
- పుకార్లను నమ్మొద్దు : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా
నవతెలంగాణ-సిటీబ్యూరో
కోెవిడ్ నిబంధనలకు లోబడి సాధారణ స్థాయిలోనే రైళ్లన్నీ నడుస్తున్నాయని, జోన్ పరిధిలో ఏ స్టేషన్లోనూ భారీ సమూహం లేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేలా దక్షిణ మధ్య రైల్వే అన్ని జాగ్రత్తలను తీసుకుందన్నారు. కొన్ని మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలను ఆయన ఖండించారు. అలాంటి వార్తలను విశ్వసించవద్దన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో అన్ని స్టేషన్ల పరిసరాలో, రైళ్లలో కోవిడ్ -19 మహమ్మారి నిబంధనకు లోబడి ప్రయాణికు సౌర్యాలు కల్పించామన్నారు. రోజుకు సగటున 180 రిజర్వుడ్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. న్యూఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నాందేడ్, ఔరంగాబాద్, పూణేతోపాటు తిరుపతి వంటి ముఖ్యమైన ప్రాంతాతో సహా దేశంలోని అన్ని వైపులకు రెగ్యుర్ రైళ్లను నడిపిస్తున్నామన్నారు. కోవిడ్-19 వైరస్ రెండో దశ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణికులు సైతం నిబంధనలను పాటించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్టు జనరల్ మేనేజర్ వివరించారు.
2020 -21 సంవత్సరంలో...
కరోనా మహమ్మారీ విజృంభిస్తున్న సమయంలో సైతం దక్షిణ మధ్య రైల్వే మౌలిక సదుపాయలాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని గజానన్ మాల్యా తెలిపారు. 2020 -21 సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే పనితీరుపై ఆయన వివరించారు. దక్షిణ మధ్య రైల్వేలో అన్ని విభాగాలో అనేక నిర్వహణ పనుతో సహా నిర్ధేశించుకున్న ఇతర క్ష్యాలను పూర్తిచేయడంలో సమిష్టిగా కష్టపడుతూ, సమర్థవంతతోపాటు సమన్వయంతో అందరూ కృషి చేయడంతో అనేక రంగాలో ముందంజ వేసిందని ఆయన అన్నారు. దక్షిణ మధ్య రైల్వేకు ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాముఖ్యమైందన్నారు. అభివృద్ధిలో భాగంగా టీసీఏఎస్ ప్రాజెక్టు అము చేయడంలో మార్గదర్శకంగా నిలిచిన అనంతరం, దక్షిణ మధ్య రైల్వే 34 రైల్వే స్టేషన్లలో 321 అదనపు కి.మీకు టీసీఏఎస్ ప్రాజెక్టును విస్తరించడం ద్వారా మరో ముందడుగు వేసిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే 42.5 కి.మీ పొడవు గ నూతన రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తిచేసింది. దీనిలో మనోహరాబాద్, గజ్వేల్ (31 కి.మీ), జక్లేర్, మక్తల్ (11.5 కి.మీ) కూడా ఉన్నాయన్నారు. దక్షిణ మధ్య రైల్వే 161.5 కి.మీ డబ్లింగ్ పను పూర్తి చేసింది. వీటిలో ఉప్పూరు, గుడివాడ, మోటూరు, గుడివాడ, మచిలిపట్నం (68.7 కి.మీ), న్లపాడు, పేరిచర్ల (7.8 కి.మీ), గజ్జెకొండ నుండి డొనకొండ వరకు (12.4 కి..మీ), పెండేక్లు, ఏదుదొడ్డి (8.6 కి.మీ), గ్లొపల్లి, షాద్నగర్ (30.2 కి.మీ), చెగిచర్ల, జంగాపల్లె (10.7 కి.మీ), తాటిచర,్ల గార్లదిన్నె (9.1 కి.మీ), ఫక్నుమా, ఉందానగర్ (14.0 కి.మీ) ఉన్నాయన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన నెట్వర్క్ పరిధిలో 60.4 కి.మీ ట్రిప్లింగ్ పను పూర్తి చేసిందన్నారు. వీటిలో 30.5 కి.మీ రాఘవపురం, కొనూర్, పోట్కపల్లి (కాజీపేట, బల్లార్షా సెక్షన్) మరియు 29.9 కి.మీ కావలి, ఉవపాడు (విజయవాడ , గూడూరు సెక్షన్) ఉన్నాయని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే అకోలా, అకోట సెక్షన్ (అకోట, కాంద్వా గేజ్ మార్పిడి ప్రాజెక్టులో భాగంగా) మధ్య 44.4 కి.మీ పొడవు గేజ్ మార్పిడి పూర్తి చేసిందని గుర్తు చేశారు. దక్షిణ మధ్య రైల్వే ఈ ఆర్థిక సంవత్సరంలో 750 ట్రాక్ కిలోమీటర్ల మొత్తం పొడవు విద్యుదీకరణ పను పూర్తి చేసింది. వీటిలో నూతనంగా విద్యుదీకరించిన సెక్షన్లు 612.7 కి.మీQ మరియు డబుల్, ట్రిపుల్ లైన్లు 137.1 కి.మీ ఉన్నాయని వివరంచారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 81 కాపలాగ లెవల్ క్రాసింగ్ తొగింపులో భాగంగా రోడ్ ఓవర్ బ్రిడ్జీను, రోడ్ అండర్ బ్రిడ్జీను మరియు పరిమిత ఎత్తుగ సబ్వేను నిర్మించిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే 658 సమయసారని పార్సిల్ రైళ్లను నడిపింది. వీటిద్వారా వివిధ ప్రాంతాకు 2,63,393 టన్ను నిత్యవసర సరుకును రవాణా చేసిందని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే 310 దూద్ దురంతో ప్రత్యేక రైళ్లను నడిపింది. వీటిద్వారా న్యూఢల్లీికి 7.30 కోట్ల లీటర్ల పాను రవాణా చేసిందని, దక్షిణ మధ్య రైల్వే జోన్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాకు120 కిసాన్ రైళ్లను నడిపిందన్నారు. వీటిద్వారా 39,561 టన్ను వ్యవసాయ ఉత్పత్తును రవాణా చేసిందని గుర్తు చేశారు.