Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
వివిధ అంశాలకు సంబంధించి డాక్టర్ సాగి సత్యనారాయణ ప్రతిభా పాటవాలకు అంతర్జాతీ య స్థాయిలో అత్యుత్తమ గుర్తింపు లభించింది. భారత ప్రతిభారత్న అంటూ ఆస్కార్ సంస్థ ఆయ నపై ప్రశంసల జల్లు కురిపించింది. వివిధ అంశా లపై ఆయన రాసిన పుస్తకాల పేర్లను ప్రస్తావి స్తూ 2020 డిసెంబర్ 25న ఆస్ట్రేలియాలో జరిగిన కార్యక్రమంలో ఆస్కార్ అవార్డును ప్రకట ించింది. ఈ మేరకు ఆస్కార్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ డైరెక్టర్ నితిన్ గావ్లి ఓ పత్రం పంపారు. ప్రతిభ అనేక మందికి ఉండొచ్చు. అయితే అసాధారణ ప్రజ్ఞ అనేది దేవుడిచ్చిన ఓ తిరుగులేని వరం. అది అతి కొద్దిమందికే సొంతం. ఆ కోవకే చెందు తారు మల్కాజ్గిరి నివాసి డాక్టర్ సాగి సత్యనా రాయణ. వైద్యుడిగా కొనసాగుతూనే మూడు దశాబ్దాల కాలంలో ఆధ్యాత్మికం, వైద్యం, జ్యోతి ష్యం తదితర అంశాలపై తెలుగు, ఆంగ్ల భాషల్లో 165 పుస్తకాలు రచించారు. వీటి ద్వారా ఇప్పటి వరకు మూడు గిన్నిస్ రికార్డులను సాధించారు. తొలి గిన్నిస్ రికార్డును 2016 జనవరి 28న అందుకోగా రెండోది అదే ఏడాది ఆగస్టులో వచ్చి ంది. మూడో గిన్నిస్ రికార్డును 2019 అక్టోబర్ 9వ తేదీన దక్కించుకున్నారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒకటి లేదా రెండు డాక్టరేట్ పట్టా లను సాధించగలుగుతాడు. మరి 33 డాక్టరేట్లు పొందడం అంటే దైవకృప తప్ప మరొకటి కానేకాదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక విశ్వవిద్యా లయాల నుంచి అత్యధికంగా 86 డాక్టరేట్లను పొందారు. ఇందులో డాక్టర్ ఆఫ్ సైన్స్ ఆరు కాగా 18 డాక్టర్ ఆఫ్ లిటరేచర్లు, 62 డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలను దక్కించుకున్నారు. ప్రస్తుతం రెండు యూనివర్సిటీలకు ఉపకులపతిగా వ్యవ హరిస్తున్నారు. అందులో ఒకటి గుజరాత్ కేంద్రంగా పనిచేసే మహర్షి వేదవ్యాస ఇంటర్నే షనల్ వేదిక్ విశ్వవిద్యాలయం 2020 ఫిబ్రవరి 15వ తేదీన డాక్టర్ సాగిని ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించింది.
ఇంకా ఎక్కడెక్కడంటే..
24-12-2019న ఇన్స్పైరింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో 22-10-2019లో లెజెండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో 21-10-2019న ఫెంటాస్టిక్ ఫ్యాబుస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో డాక్టర్ సాగి సత్యనారాయణ పేరు నమోదైంది. 13-03-2019న తెలంగాణ ప్రభుత్వం... భారత ప్రతిభారత్న పురస్కారం అందజేసింది. జ్యోతిష్యంలో అసాధారణ ప్రజ్ఞను గుర్తించిన నాగపూర్ కేంద్రంగా పనిచేసే జ్యోతిష్య విశ్వవి ద్యాపీఠం 16-08-2018న స్వర్ణపతకం అంద జేసింది. 2013లో డాక్టర్ సాగి సత్యనారాయణ రచించిన శ్రీమద్ హనుమద్ భాగవతం పుస్తకా న్ని ఢిల్లీ తెలుగు అకాడమీ... అత్యుత్తమ పుస్తక ంగా గుర్తించింది. ఇందుకుగాను నగదు బహు మతి అందజేసింది. గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 15-11- 2013న జరిగిన కార్యక్రమంలో సత్యసాయి భక్తుడైన డాక్టర్ సాగి సత్యనారాయణకి స్వర్ణ కం కణం తొడిగి సత్కరించారు. బ్రహ్మజ్ఞానం పుస్తకా న్ని రచించినందుకుగాను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జ యిని విశ్వవిద్యాలయం నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు.