Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ముస్లిములు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ మాసాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ సూచించారు. లాలాపేటలో హలీం విక్రయ కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వివిధ పోషక విలువలు కలిగిన రుచికి మారుపేరుగా హలీం నిలుస్తోందని, తయా రీలో నాణ్యతను పాటించాలని అన్నారు. రూల్స్ పాటిస్తూ కొవిడ్ వ్యాప్తిని నివారించడంలో అందరూ సహకరించాల న్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ రెడ్డి, సునీల్ ముదిరాజ్, శ్రీనివాస్‌గౌడ్, నాగేశ్వరరావు, కె.నాగరాజు గౌడ్, నాగులు, నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు.