Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ (ఏఐటీయూసీి) అనుబంధ సంఘంలో సుమారు వెయ్యి మంది క్యాబ్ డ్రైవర్లు చేరారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీ యూసీ, సత్యనారాయణరెడ్డి భవన్లో తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) సంఘంలో వివిధ ఏరియాలకు సంబందించిన క్యాబ్ డ్రైవర్లు చేరారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర రోర్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.వెం కటేశం మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి కరోనా కారణంగా క్యాబ్ డ్రైవర్లు జీవనోపాధి దెబ్బతిన్నదని తెలిపారు. ఈ ఏడాది కాలంలో అనేకమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు క్యాబ్ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందుల గురించి విన్నవించినా, ఆందోళన చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మోటార్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి క్యాబ్‌లకు మీటర్లను ఏర్పా టు చేసి ఓలా, ఊబర్ సంస్థలను నియంత్రించి, క్యాబ్ డ్రైవ ర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలం గాణ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకు న్నారు. గౌరవాధ్యక్షులుగా బి.వెంకటేశం (ఏఐటీయూసీ), ప్రెసిడెంట్‌గా ఎండీ సలీమ్‌పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దూపం అంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా టి.రాజశేఖర ్రెడ్డి, ఉపాధ్యక్షులుగా సీహెచ్ ప్రేంచందర్‌రెడ్డి, ముక్తార్ అహ్మద్, సురేష్ కుమార్, కొండల్‌రెడ్డి, జాయింట్ సెక్రెట రీగా లక్ష్మీనారాయణ, మల్లిఖార్జున్, రమేష్, బాలరామ్, మధుసుధన్, ఈశ్వరయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా మురళీ కృష్ణ, డేవిడ్, గజానంద్ శివ, సతీష్, క్రిష్ణ, కోశాధికారిగా అమన్ దీప్, కమిటీ మెంబర్స్‌గా ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.