Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్‌పేట
ఎంత పెద్ద వర్షాలు కురిసినా ముంపు సమస్య తలెత్త కుండా శాశ్వతంగా పరిష్కారం త్వరలోనే కాబోతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6, 27, 45వ డివిజన్లలో రూ.35లక్షలతో ఏర్పాటు కానున్న పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్పొరేషన్లో ప్రజలకు ఇబ్బందులు కలకుండా రోడ్లు, డ్రెయినేజీ ఏర్పా టుకు పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థా పన చేశామన్నారు. గతంలో వర్షాలు కురుస్తున్నాయంటే ఎక్కడ మా కాలనీలు, ఇండ్లు మునిగిపోతాయో అన్న భయం ఉండేదనీ, ఇక నుంచి ఉండదనీ, ముంపు సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ వరద కాలువ నిర్మాణం కోసం ఒక్క మీర్పేట్ కార్పొరేషన్‌కే రూ.45 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. త్వరలో పనులు కూడా ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్ లాల్ చౌవాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కమిషనర్ సుమన్‌రావు, డీఈ సత్యనారాయణ, ఏఈ కృష్ణయ్య, స్థానిక కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలు, వివిధ కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.