Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు కానూరి వెంకటేశ్వరరావు జీవితం నేటి కళాకారులకు ఆద ర్శప్రాయంగా నిలుస్తుందని వీక్షణం పత్రికా సంపాదకులు ఎన్.వేణుగోపాల్ కొనియాడారు. సీపీఐఎంఎల్ న్యూడె మోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కానూరీ వెంకటేశ్వరరావు ఆరో వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వండేండ్ల తన జీవితంలో ప్రజా కళలకు సాహిత్యా నికి పట్టం కట్టడమే గాకుండా ఆదర్శ విప్లవ కమ్యూనిస్టుగా ఆయన సృష్టించిన అనేక కళారూపాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. నేడు దేశంలో పాలకులు హిందు త్వం పేరిట ప్రజా కళాకారులపై రచయితలపై ఉద్యమకా రులపై సాగిస్తున్న దాడులను నిర్బంధాన్ని వ్యతిరేకించార న్నారు. ప్రజా కళలను సంస్కతిని కాపాడుకోవడానికి ఐక్య ంగా ముందుకు సాగాలని సూచించారు. జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినరుబాబు, సీపీఐఎంఎల్ న్యూడెమో క్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, నాయ కులు కె.గోవర్ధన్, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య తదితరులు ప్రసంగించిన వారిలో ఉన్నారు. అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు పి వేణు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం, ఐఎప్టీయూ నాయకురాలు అనురాధ, పీఓడ బ్ల్యూ నాయకులు జయసుధ, ఏఐకెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొ ండపల్లి అచ్యుతరావు, రుషిపతి, శివకుమార్ పాల్గొన్నారు.