Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మున్సిపాల్టీలోని అన్ని వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముళ్లి పావనీ జంగయ్య యాదవ్ అన్నారు. రెండో వార్డు కౌన్సిలర్ కొమ్మగొని రమాదేవితో కలిసి శనివారం వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాల్టీలోని అన్ని వార్డుల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ ఇతర సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీనివాస్, వర్కు ఇన్స్పెక్టర్ మారుతి, వార్డు సభ్యులు శివ, మంజుల, యాదగిరి, శశికళ, తదితరులు పాల్గొన్నారు.