Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అడ్డగుట్టలో గతంలో ఉన్న సి- సెక్షన్ మెయిన్ కమి టీ హాల్ స్థానంలో కొత్త కమిటీహాల్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) అడ్డగుట్ట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. అడ్డగుట్ట ఏర్పాటు సమయంలో ఇక్కడ హాల్ నిర్మాణానికి స్థలం వది లితే 1988లో టీడీపీ హయాంలో కమిటీ హాల్‌ను నార్మ ల్గా నిర్మించారని సీపీఐ(ఎం) సికింద్రాబాద్ కార్యదర్శి అజరుబాబు అన్నారు. 2012 లో ఈదురుగాలులు, భారీ వాలనకు ఆ హాల్ పైకప్పుగా ఉన్న రేకులు పగలడం, రంద్రాలు ఏర్పడటం జరిగిందన్నారు. డోర్లు, కిటికీలు పాడవుతూ వచ్చాయని చెప్పారు. అన్నిచోట్ల కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నారని పాడైన ఇక్కడి కమ్యూనిటీహాల్ స్థానంలో కొత్తది మంచిగా నిర్మించాలని జీహెచ్ఎంసీ అది óకారులను కోరుతూ వచ్చినా పట్టించుకోలేదని, చివరకు 2020 ఆగష్టులో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు క మ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకూ ఆ నిర్మాణం జరగలేదన్నారు. వెంటనే ప్రారంభించాలని, మల్టీపర్పస్ కమ్యూనిటీహాల్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం) నాయకులు ఎ. బాలయ్య, ఎం. గోపాల్, ఆర్. బాల మణి, అలేఖ్య, గోవిందమ్మ, సుగుణమ్మ, యాదగిరి, గౌర య్య తదితరులు పాల్గొన్నారు.