Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలసేమియాతో బాధపడుతున్న ఓ పసివాడి కుటుంబం అభ్యర్థన
నవతెలంగాణ-బోడుప్పల్
వారిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. కూలీకి వెళ్తే తప్పా పూట గడవని స్థితి ఆ దంపతులది. భర్తకు వచ్చే అంతంత మాత్రం జీతమే వారికి జీవనాధారం. ఉన్నంత లోనే సంతోషంగా సాగే జీవితం. ఇంతలోనే వారికి పెద్ద కష్టమొచ్చింది. వాళ్ల 12 ఏండ్ల కుమారుడికి పుట్టుకతోనే తలసిమీయా ఉందని... ఆపరేషన్ చేయకపోతే కష్టమేన ని చెప్పిన వైద్యుల మాట వారిని కుంగదీసింది. 12 ఏండ్లుగా వైద్యుల సలహా మేరకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించి మందులు వాడుతున్నారు. ఇప్పటికే సుమారు రూ.5 లక్షల వరకు అ పసివాడి వైద్యం కోసం ఖర్చు చేశారు.
ఆ తల్లిదండ్రులు ఎక్కని మెట్టు లేదు.. తొక్కని గడప లేదు.. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అతుకుల బొతు కుల జీవితంలో.. కొడుకునెలా కాపాడుకోవాలో తెలియని ధైన్యం వాళ్లది. ఈ కన్నీటి గాథ.. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నందాతండాకు చెందిన మాలోతు కిషన్ లాల్, కళవతి దంపతులది. వారికి 12 ఏండ్ల కుమారుడు లక్మ్షీ నరసిం హ ఉన్నాడు. లక్మ్షీ నరసింహ పుట్టిన తొమ్మిది నెలలకు ఆహార పదార్థాలు తినటంలో ఇబ్బందులు తలెత్తడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించారు. భయంకరమైన తలసేమియా వ్యాధితో అ చిన్నారి పోరాడుతున్న విషయం వైద్యులు చెప్పడంతో అవాక్కైన తల్లిదండ్రులు అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒక సారి తప్పనిసరిగా రక్త మార్పిడి చేయిం చాలి.. లేకపోతే అ బాలుడు నడవలేక ఇబ్బందులు పడు తుంటాడు.. ముఖం కూడా అందవికరంగా మారుతుంది.
ఆపరేషన్‌కు రూ.9 లక్షలు..
లక్మ్షీ నరసింహకు తలసేమియా నుంచి ఉపశమనం చేసేందుకుగాను అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యు లు బెంగళూరులోని మహావీర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసేందుకు నిర్ణయించారు. ఈ ఆపరేషన్ లక్మ్షీ నరసిం హకు 14 ఏండ్లు నిండక ముందే చేయించి అతనికి పునర్జ న్మ ఇవ్వాలని తెలిపారు. అయితే లక్మ్షీ నరసింహకు తన అక్క సిమ్రాన్ (15) దాతగా (తలసేమియాను ప్రారద్రో లేందుకు గాను ఎముకల నుంచి గుజ్జును తీసి వ్యాధితో బాధపడుతున్న వారికి ఎక్కిస్తారు) ముందుకు రావడంతో ఆమెకు కూడా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి జూన్ మొదటి వారంలో ఆపరేషన్ చేసేందుకు ఖరారు చేశారు. ఇక ఎటోచ్చి ఆపరేషన్‌కు అవసరమైన డబ్బుల కోసం వారు ఎక్కుని మెట్లు లేవనే చెప్పాలి. లక్మ్షీ నరసింహ తండ్రి కిషన్‌లాల్ ఓ బేకరీలో చిన్న ఉద్యోగం చేస్తూ తనకు వచ్చే జీతంతో పిల్లలను చదివిస్తూ, ఇంటి అద్దె కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అలాంటిది ఆపరేషన్‌కు అయ్యే రూ.9 లక్షలను ఎలా సమకూర్చుకోవాలో అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నారు.
దాతల కోసం ఎదురుచూపు..
ఇప్పటికే 12 ఏండ్లుగా అ బాలుడికి అవసరమైన వైద్యం చేయించడానికి వారు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం బెంగళూరు మహావీర్ హాస్పిటల్లో జరిగే ఆపరే షన్ వారికి పూర్తి స్థాయిలో భారంగా మారింది. దీంతో తలసేమియా సొసైటీ వారిని ఆశ్రయించారు. వారు ఓ స్వచ్ఛంద సంస్థ సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ వారు కొంతమేరకు సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. ఇంకా కావాల్సిన ఖర్చులు అధికంగా ఉండడంతో దాతలు ముం దుకు వచ్చి సహాయం చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.
భవిష్యత్‌లో క్రికెటర్ కావడమే తన లక్ష్యం..
తలసేమియాతో బాధపడుతున్న లక్మ్షీ నరసింహ ప్రస్తుతం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 8 తరగతి చదువుతున్నాడు. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత మంచి క్రికెటర్‌గా రాణిస్తానని ఆశా భావం వ్యక్తం చేశారు. అతను భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నా అతనిలో ఉన్న ఆత్మవిశ్వాసం ముందు వ్యాధి పెద్దదేమి కాదనే అనుకోవాలి.
సాయం చేసే వారు ఈ అకౌంట్ నెంబర్‌కు ట్రాన్స్ఫర్ చేయగలరు
M.KALAVATHI
Alc : 0149326000004611
Lakshmi Vilas Bank Branch - Boduppal
IPSC - LAYB 0000 149
PH NO : 9000311210
Google pay : 9000311210
phone pay: 9000311210