Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
చెరువుల పరిరక్షణపై అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చెరువు స్థలాలన్నీ కుంచించుకు పోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్, బఫ్పర్ జోన్ ప్రాంతాల్లో చెరువులను పూడుస్తున్న కూడా సంబంధిం చిన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధి లోని చెంగిచెర్ల రెవెన్యూ సర్వే నెంబర్ 79లో ఉన్న చింత ల చెరువుకు దక్షిణ భాగంలో కొంత మంది వ్యాపారులు చెరువును పూర్తి స్థాయిలో పూడ్చి మట్టి పోయించి ప్లాట్లను చదునుగా చేసి లీజ్ కు ఇవ్వడానికి తీర్చిదిద్దారు. అయితే చెరువుకు బాగా దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో మట్టి పోసి చదునుగా చేసే అధికారం ఏ అధికారి ఇచ్చాడో మాత్రం చెప్పడం లేదు.అదే విధంగా సదరు చెరువు స్థలాన్ని పరిరక్షించాల్సిన సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు. ఇలాగే చూసి చూడనట్లుగా ఉంటే భవిష్యత్తులో ఏ చెరువును కూడా కాపాడలేమనే వాదనలు వినిపిస్తున్నాయి.