Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందస్తు ఏర్పాట్లు లేక ప్రజల ఇబ్బందులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
'జీహెచ్ఎంసీలో పని చేస్తున్న కార్మికుని నుంచి కమిషనర్ వరకూ ఉద్యోగులు, అధికా రులు అందరు కరోనా వ్యాక్సిన్ వేయించుకో వాలి. అందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఏర్పా ట్లు చేయాలి. ప్రతి పౌరుడూ వ్యాక్సిన్ వేయించు కోవాలి' అని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచే శారు. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీ వరకు జీహెచ్ఎంసీలో పని చేస్తున్న ఉద్యోగులంతా టీకా తీసుకునేలా జోనల్ కమిషనర్లు ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ లోకేష్‌కుమార్ ఆదేశిం చారు. సీఎం, కమిషనర్ పిలుపుమేరకు గ్రేటర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సి న్ కోసం జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సామాన్య ప్రజానీకం వెళ్లడంతో భారీగా బారులు తీరాల్సివ చ్చింది. అయితే జీహెచ్ఎంసీ అధికారుల ముం దస్తు ప్రణాళిక లేకుండానే పిలుపునివ్వడంతో ఇబ్బందులు పడాల్సివచ్చిందని పలువురు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉండటంతోపాటు ఒక్కసారిగా వెళ్ల డంతో ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి తిప్పలు తప్ప లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సుమారు 145 వరకు ఉన్నా యి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి.
ఒక్కో సెంటర్లో రోజుకు 100మందికి
జీహెచ్ఎంసీ పరిధిలోని గాంధీ, ఉస్మా నియా, ఈఎన్టీ, సరోజిని కంటి ఆస్పత్రి, కింగ్ కోఠిలోని జిల్లా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతోపాటు 145కిపైగా ఉన్న పట్టణ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వేస్తు న్నారు. వీటితోపాటు ప్రయివేట్ సెంటర్లకు సైత ం అనుమతి ఇచ్చారు. అయితే ముందుగానే స్లా ట్ బుక్ చేసుకున్నవారికి ప్రతి సెంటర్లో రోజుకు 100మందికి మాత్రమే టీకా వేస్తున్నా రు. కానీ శనివారం భారీగా జనం తరలివచ్చారు. బల్దియా ఉద్యోగులు, ఇతరులకు ఏలాంటి ప్రత్యే క ఏర్పాట్లు చేయకపోవడంతో గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వచ్చింది. జనం భారీగా రావడంతో కరోనా కేసులు పెరిగే ప్రమాదముం దని అటు జనం, ఇటు వైద్యసిబ్బంది భయాందో ళనకు గురయ్యారు.
కొవిడ్ కంట్రోల్ రూం ఖాళీ
జీహెచ్ఎంసీలో అత్యవసర సేవల నిమి త్తం ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూం ఖాళీ అయింది. ఒక పక్క కరోనా నివారణ చర్యలు, మరో పక్క వ్యాక్సిన్ కోసం సేందేహాలు నివృత్తి చేయాల్సిన కంట్రోల్ సెంటర్లో అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. గ్రేటర్లో కరోనా కేసులు పెరుగుతు న్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసినా జీహెచ్ఎ ంసీ పట్టించుకోవడం లేదు. కొవిడ్ బారినపడిన రోగులు ఫోన్ చేస్తే సమాధానం ఇచ్చేవారే కరు వయ్యారు. డ్యూటీలో షిఫ్టుల వారిగా ముగ్గురు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పని చేయాలని కమి షనర్ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కానీ డ్యూటీలో ఒకరు మాత్రమే ఉంటున్నారు. హాలిడే వచ్చిందంటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. కొవిడ్ రోగులు మందుల విష యంలో సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. జీహెచ్ఎంసీ పరిధి లో కోవిడ్ భారిన పడినవారు, టెస్ట్ సెంటర్స్‌తో పాటు కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్ కోసం సంప్రది ంచాల్సిన కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 9154686549, 9154686558 కాల్ చేస్తే స్పందన నామమాత్రమే. ఇప్పటికైనా అధికారు లు చర్యలు తీసుకుని కరోనా నివరాణ, వ్యాక్సిన్ సేవలపై అప్రమత్తంగా ఉండాలని జనం కోరుతున్నారు.