Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-బంజారాహిల్స్
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. గాంధీ కుటీర్ బస్త్తీ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌తో పాటు కమిటీ సభ్యలైన రాజ్‌కుమార్, శివ ప్రసాద్, నరేష్ మన్నె గోవర్ధన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ బస్తీి సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకునిరావాలని, అట్టి సమస్యలను వెంటనే పరిష్కారించడానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యలను అభినందించారు.