Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మలక్‌పేట్
జర్నలిస్ట్‌లకు అండగా ఉంటాం అని కొత్తపేటలోని ఓమ్ని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్. వెంకట్ రెడ్డి అన్నారు. దిల్సుఖ్ నగర్‌లోని వర్కింగ్ జర్నలిస్టులకు గత నాలుగు సంవత్సరాల నుండి 10లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, ఐదవ సంవత్సరం కుడా జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కొరకు పెద్ద మనస్సు తో ముందుకు వచ్చి రూ.2,08,980/- ( రెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల చెక్ )ను శనివారం ఇన్సూరెన్స్ సంస్థకు అందచేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఐదో సంవత్సరం కుడా జర్నలిస్టుల పట్ల గౌరవం, ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు 10లక్షల రూపాయల ప్రమాద బీమాకు అవసరమయ్యే ప్రీమియం తామే చెల్లిస్తామని, అందులో భాగంగా చెక్‌ను ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులకు అందజేయడం జరిగింది అన్నారు. ఆనంతరం టీయూడబ్ల్యూజె 143 ప్రధాన కార్యదర్శి ఓరుగంటి నాగరాజు గుప్త మాట్లాడుతూ హాస్పిటల్ యాజమాన్యం, డైరెక్టర్లు జర్నలిస్టులకు అనుక్షణం అండగా ఉంటున్న ఓమ్ని హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్. వెంకట్‌రెడ్డి, డాక్టర్. గౌతమ్‌రెడ్డి, డాక్టర్ సందీప్ రెడ్డిలకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, సుభాష్, సైదులు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.