Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని, కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉపవాస దీక్షలు చేపట్టేవారికి ఆటంకం కలుగకుండా ఉండేందుకు సమగ్ర వంటకాల సమాచారంతో కూడిన ''రంజాన్ రిలీష్'' అనే పుస్తకాన్ని నగరంలోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఒకటైన ఆలివ్ హాస్పిటల్‌వారు శనివారం బంజారాహిల్స్‌లోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. నైపుణ్యం కలిగిన పోషకాహార నిపుణులు తయారుచేసిన ఆరోగ్యకర వంటకాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ పుస్తంలో పొందుపరిచారు. రుచికరమైన వంటకాలతోపాటు ఉపవాసదీక్షలు చేసేవారికి అవసరమైన శక్తినిచ్చే వంటకాల సమచారాన్ని ఈ 'రంజాన్ రిలీష్'' చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో పొందుపరిచిన ఆహార నియమాలు ఆరోగ్యాన్ని, శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి.ఈ ''రంజాన్ రిలీష్' పుస్తకావిష్కరణ సందర్భంగా ఆలివ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అగా ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఉపవాసం అనేది ప్రతీ మతంలో ఏదో ఒక రూపంలో ఆచరించే విధానంగా ఉందన్నారు. శరీరానికి అవసరమైన ఆహార నియమాల అనుసరణ కూడా ఇందులోని ప్రధాన ఉద్దేశం అన్నారు. డైటింగ్ ఉపవాసాలకు మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోవచ్చన్నారు. డైటింగ్ చేయడం ద్వారా శారీరకమైన మార్పులకు కారణం అవుతుందని, ఉపవాసాలు చేయడంవల్ల ఆధ్యాత్మిక కోణంలో దృష్టి కేంద్రీకరించగలుగుతారని తెలిపారు. ''రంజాన్ రిలీష్'' పుస్తకానికి సంబంధించిన ఇ-కాపీని www.olivehospitals.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.