Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 48.5 తులాల బంగారం, 53.4 తులాల వెండి, రూ.1, 55,000 నగదు స్వాధీనం
నవతెలంగాణ-హయత్నగర్
చెడు అలవాట్లకు బానిసై చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మల్కాజిగిరి, జవహర్నగర్, మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శనివారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. రోషన్ కుమార్ సింగ్ అలియాస్ రోషన్ అలియాస్ దీపు స్వస్థలం బీహార్ రాష్ట్రం. మల్లెపూల చేతన్ అలియాస్ మోని ఇతను యాప్రాల్లో ఉంటున్నాడు. ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివాసం ఉండడంతో స్నేహితుల య్యారు. క్రమంగా చెడు అలవాట్లకు బానిసై సిగరెట్, గంజాయి సేవించే వారు. జల్సాల కోసం రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడేవారు. చోరీ సొమ్ముతో జల్సాలు చేసేవారు. మార్చి 16న జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరా రెడ్డి అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి నాచారం వెళ్లాడు. అదే రోజు సాయంత్రం ఇంటికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న విలువైన వస్తువులు కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు యాప్రాల్లో నిందితులను అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 48.5 తులాల బంగారం, 53.4 తులాల వెండి, రూ.1, 55,000 నగదు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.26 లక్షల 50వేలు ఉంటుందని తెలిపారు. మీడియా సమావేశంలో సీపీతోపాటు క్రైమ్స్ డీసీపీ యాదగిరి, సిబ్బంది సలీమా, వెంకన్న, రవి బాబు, మధు కుమార్ తదితరులు ఉన్నారు.