Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
మెగా లోక్ ఆదాలతో హయత్ నగర్ కోర్టులో మొత్తం 294 కేసులు రాజీ కుదిర్చామని 24వ మెట్రోపాలిటన్ జడ్జి సంధ్యారాణి అన్నారు. శని వారం నిర్వహించిన లోక్ ఆదాలత్ కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్తో ప్రజలకు న్యాయస్థానం కల్పించిన సువర్ణ అవకాశమని, స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకునేకంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని న్యాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణోదయ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వర రెడ్డి, బెంచ్ మెంబర్స్ వేణుగోపాల్, రామ్మోహన్, శ్రీనివాస్, మహాత్మా, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.