Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగుళూర్ వేదికగా మోసాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
- ముగ్గురు నిందితుల అరెస్టు
- 24 స్టాంప్స్, 22 మొబైల్స్, 14 బ్యాంక్ అకౌంట్స్ స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నకిలీ ఆన్లైన్న ట్రేడింగ్ యాప్స్ సృష్టిచి అందినకాడికి దోచుకుంటున్న ముగ్గురు నిందితులను రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 24స్టాంప్స్, 22మోబైల్స్, 14 బ్యాంక్ అకౌంట్స్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు బెంగుళూర్‌కు చెందిన అశోక్ కుమార్ అర్ముంగ్, కంచి సంజీవ్ కుమార్, ఆసీమ్ అక్తర్‌లు ఒక ముఠాగా ఏర్పాడ్డారు. 'విన్బ్జ్','స్ట్రాటజీ టీమ్', 'హెక్టర్ లెండ్కారో ఇండియా.ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు తదితర పేర్లతో ఆన్లైన్ ట్రేడింగ్ యాప్‌లను సృష్టించారు. తాము చెప్పిన విధంగా ఆల్‌లైన్ ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలొస్తాయని ఆన్లైన్లో ప్రచారం చేశారు. వాట్సాప్‌లో మెసేజ్‌లను పంపించారు. నకిలీ స్టాంప్‌లతో దాదాపు 15 నకిలీ కంపెనీలను సృషించిన నిందితులు అందులో పెట్టుబడులు పెట్టించించారు. ఒక్కొకరి నుంచి వేలల్లో డిపాజిట్ చేయించిన ఈ ముఠా రూ.54,39,310 వసూలు చేసింది. బెంగుళూర్ వేధికగా మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాపై మోసపోయిన బాధితులు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేశారు.