Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌడీషీటర్లకు ఇన్స్పెక్టర్ శివచంద్ర కౌన్సెలింగ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
తీరుమార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని, నేరాలకు పాల్పడితే పీడియాక్టులు నమోదు చేస్తామని, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివ చంద్ర అన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన రౌడీషీటర్లను శనివారం స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు తీసుకున్న ఆయన ముందుగా రౌడీషీటర్లనే టార్గెట్ చేస్తూ శాంతిభద్రతల విషయంలో ప్రజలకు భరోసా కల్పించారు. రౌడీషీటర్లతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏసీపీ ఎం. సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కౌన్సిలింగ్ కార్యక్రమం సందర్భంగా రౌడీషీట్లర్లను ప్రత్యేకంగా మీడియాముందు ప్రవేశపెట్టి వారికి హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితేగనుక బాధ్యులైనవారిపై చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. గతంలో కొందరిపై పీడీ యాక్టులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రౌడీలమని చెప్పుకుంటే అక్రమాలకు పాల్పడేవారు వెంటనే తమ తీరు మార్చుకుని ప్రజల్లో మమేకమై స్వేచ్ఛగా జీవించాలని సూచించారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్సైశ్రీనివాస్, ఎస్సైలు రాంబాబు, రవిరాజ్, ఉదరు, రామ్ రెడ్డి, బాలరాజ్, వాసవి, అజరు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.