Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివిజనల్ రైల్వే మేనేజర్ అజరుకుమార్గుప్తా
- చిలకలగూడ హెల్త్ యూనిట్లో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్‌లోని చిలకలగూడ హెల్త్ యూనిట్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సికింద్రాబాద్ డివిజిన్ డివిజినల్ రైల్వే మేనేజర్ అభరు కుమార్ గుప్తా శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డా.సి.రవీంద్ర శర్మతోపాటు సికింద్రాబాద్ డివిజన్ అడిషినల్ డివిజినల్ రైల్వే మేనేజర్ రవిచంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభరు కుమార్ గుప్తా మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాపించ కుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా చిలకలగూడలో వ్యాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సర్వీసులో ఉన్న సిబ్బందితోపాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగ పర్చుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ వేసుకోవాలనుకునేవారు కౌంటర్లో పేర్లు నమోదు చేసుకుంటే రైల్వే సిబ్బంది వారికి వ్యాక్సిన్ అందిస్తారన్నారు. ఇదిలావుండగా వైరస్ విస్తరించకుండా సికింద్రాబాద్ డివిజినల్ కార్యాయం హెడ్‌క్వార్టర్స్, సంచాన్ భవన్ వద్ద సిబ్బందికి కోవిడ్ పరీక్ష కోసం క్యాంపు నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న కాజీపేటలో కోవిడ్ కేర్ సెంటర్ వద్ద వ్యాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సెంటర్లో సర్వీసులో ఉన్న సిబ్బందితోపాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారని గుర్తు చేశారు.