Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయ యువసేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కావలి సత్యరాజు డిమాండ్ చేశారు . ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కావలి సత్యరాజ్ మాట్లాడుతూ గిరిజనుల రిజర్వేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో వాల్మీకి బోయల గురించి ఎక్కడ ప్రస్తావించకపోవటం బాధకరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జివోను విడుదల చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. వెంటనే వాల్మీకి బోయ ఫెడరేషను పాలకమండలిని ఏర్పాటు చేసి 100 కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు బొడ్డి శేఖర్, బి.గోపాల్, అవిటి నర్సింహా, జి.కుమారస్వామి నాయుడు, బోయ హన్మంతు, వెంకటేష్ నాయుడు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.