Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
శ్రీమత్ పరమ హంస పరివాజ్రకాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ నసింహ భారతీ స్వామి పీఠాధిపతి, శ్రీ పుష్పగిరి శారద లక్ష్మీ నసింహ పీఠం వారి చేతులమీదుగా శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది నంది అవార్డును బండ సంగారెడ్డి (సంగన్న)కు అందజేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గాన సభా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి ప్లవ నామ సంవత్సర ఉగాది నంది అవార్డుల తో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా జర్నలిస్టు విభాగంలో ఉత్తమ జర్నలిస్టు గా బండ సంగారెడ్డి (సంగన్న) కు నంది అవార్డు దక్కింది. సంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో జర్నలిస్టు గా, ఆయన చేసిన వివిధరకాల ఆధ్యాత్మిక సామాజిక సేవలకు గుర్తింపు గా ఆవార్డును అందజేశామని నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎస్వీబీసీ కరస్పాండెంట్ పని చేస్తున్నారు. ధర్మ రక్షణ చారిటబుల్ టస్ట్రు ఆద్వర్యంలో నిర్వహించిన. ఈ కార్యక్రమంలో టస్ట్రు వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ వామన వాదిరాజు జ్యోషీ పండిత్, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.