Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
నవ తెలంగాణ-జగద్గిరిగుట్ట
సంక్షేమ సంఘాలు కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ కృష్ణ మహలక్ష్మీనగర్ సంక్షేమ సంఘం సభ్యులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాలనీలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రఘుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు బైజు, ప్రధాన కార్యదర్శి చలపతిరావు, జాయింట్ సెక్రటరీ నరేష్‌రెడ్డి, కోశాధికారి సత్యనారాయణ మూర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, టీఆర్ఎస్ నాయకులు పరుష శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.