Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
హైదరాబాద్ జిల్లాలో కరోనా సందర్భంగా కొత్తగా తీసుకున్న ఆశావర్కర్లు కొనసాగించాలని కోరుతూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ నగర అధ్యక్షులు జనగామ కుమారస్వామి, కార్యదర్శి ఆర్ వాణిల ఆధ్వర్యంలో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడు తూ కరోనా నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులపై పనిభారం, కొత్త ఉద్యోగాల గురించి చర్చించినట్లు తెలిపారు. 2020 సంవత్సరంలో హైదరాబాద్ జిల్లాలో కరోనా వచ్చిన సమయంలో కొత్తగా సుమారు 800 మంది ఆశా వర్కర్లలను ఆరు నెలలు సంవత్సర కాలం కోసం విధుల్లోకి తీసుకున్నారని కరోనా నివారణ కోసం మెడికల్ సిబ్బందితో పాటు ఆశ వర్కర్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేసిన కషిని ప్రభుత్వం గుర్తించి రెండో దశలో కరోనా విజంభిస్తున్న సమయంలో వారి సేవలను కొనసాగించాలని కోరినట్లు తెలిపారు. హైదరా బాద్ జనాభాకు అనుగుణంగా సిబ్బందిని నియమిం చాలని మంత్రికి వివరించామన్నారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.