Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లపై చెత్త పెరుకుపోవడంతో దుర్గంధంతో వాహనదారులకు ఇబ్బందులు
- స్వచ్ఛ ఆటో వాలాల సమయపాలన లేకపోవడం, వారికి నిర్ణీత రుసుము నిర్ణయించకపోవడం వల్ల రోడ్ల పైనే చెత్త వేస్తున్న ప్రజలు
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి జీహెచ్ఎంసి పరిధి కూకట్పల్లి సర్కిల్లో, పలు బస్తీల్లో, కాలనీల్లో బిన్ ఫ్రీ సిటీ చెయ్యాలనే సదుద్దేశ్యంతో ఆయా ప్రాంతాల్లోని పరిసర ప్రాంతాల ప్రజలు చెత్తవేయకుండా, డస్ట్ బిన్స్ మొత్తాన్ని కూకట్ పల్లి జోన్ ప్రాంతంలో పూర్తిగా తొలగించారు, వాటిని తొలగించినందువల్ల (జీవీపీి) గార్బేజీ వెండింగ్ పాయింట్లు చాలా వారికి తగ్గినప్పటికీ, కొన్ని సమస్యా త్మకమైనటువంటి ప్రాంతాల్లో బస్తీవాసులు, కాలనీ వాసులు, దీనబంధు కాలనీ నాలా సమీపంలో, అలాగే ప్రేమ్‌సాగర్ సరోవర్ వద్ద, అలాగే సప్తగిరి నగర్ నాలా వద్ద, ప్రజలు తమ ద్విచక్ర వాహనాలపై వస్తూ, వాహనాలు నడుపుతూనే ప్లాస్టిక్ కవర్లో తెచ్చే చెత్త, రోడ్ల పక్కనే విసురుతూ చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఈ విషయంలో శానిటేషన్ సిబ్బంది అలసత్వం వల్ల ప్రజలు వేసే చెత్త వేస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతమంతా దుర్గంధంతో ముక్కుపుటాలదిరేలా అటుగా వెళ్లే ప్రజలు ముక్కు మూసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి దాపురిం చింది. కావున ఇకనైనా ప్రజల ఇబ్బందులను, వారి ఆరోగ్య పరిస్థితులను అర్ధం చేసుకుని రోడ్లపై చెత్త వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని, బిన్ ఫ్రీ సిటీ మాత్రమే కాదు, చెత్తా చెదారంలేని ఫ్రీ సిటీగా చర్యలు చేపడితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండగలమని, అందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం బిన్ ఫ్రీ సిటీ చేయడం వలన ప్రజలందరూ ఇంటి దగ్గరకు వచ్చే స్వచ్ఛ ఆటో పారిశుధ్య కార్మికులు సరైన సమయ పాలన పాటించక పోవడం, అదేవిధంగా జీహెచ్ఎంసి అధికారులు స్వచ్ఛ ఆటో కార్మికులకు ప్రతి ఇంటికి నెలకు నిర్ణీత రుసుము యాభై రూపాయలా, లేక ఎనభై రూపాయలా నిర్ణయించకపోవడం వలన ప్రజల వద్ద నుండి ఒక్కో ఇంటి నుండి ఒక్కోరకంగా నగదు వసూలు చేస్తూఉండటం వల్ల కుటుంబాలకు స్వచ్ఛ ఆటో కార్మికులకు సమన్వయలోపం కారణంగానే ప్రజలు రోడ్లపై చెత్త వేయడానికి ప్రధాన కారణామవుతుందని తెలిపారు. అదే విధంగా రోడ్డుపై బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారికి రూ.500 జరిమాన విధిస్తామన్న నిబంధన కాగితాలకే పరిమితమైంది కాబట్టి, ప్రజలు ధైైర్యంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడంతో పలువురు అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు.