Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
నాచారం టెలిఫోన్ ఎక్చ్సేంజి కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న స్థలంలో ఆకులు అలము లుతో పాటు ఉపయోగం లేని వస్తువులకు నిప్పు అంటుకొని ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పక్కనే ఉన్న ఫైర్ సిబ్బంది అప్రమత్తమై ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నూతనంగా నిర్మించుటకు తీసుకువచ్చిన పైపులు నిప్పు అంటుకుని అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 50వేల ఆస్తి నష్టం సంభవించినట్లు ఫైర్ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవించిన వివరాలను సేకరిస్తున్నట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు. పక్కనే ఫైర్ స్టేషన్ ఉండడంతో పెను అగ్ని ప్రమాదం తప్పిందని టెలిఫోన్ ఎక్చ్సేంజి సిబ్బంది పేర్కొన్నారు. ఈ మేరకు నాచారం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించినట్లు వెల్లడించారు.