Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్
నవ తెలంగాణ-జగద్గిరిగుట్ట
నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కుత్బుల్లాపూర్ మండల కార్య దర్శి కీలుకాని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆదివారం సూరారం డివిజన్ షాపూర్ నగర్లో సీపీిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ళ క్రితం దరఖాస్తు చేసుకున్న పేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటించాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం టీిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల స్కీమ్‌గా వాడుకుంటుం దన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దరఖాస్తులను పరిశీలించి లభ్దిదారుల లిస్టు ప్రకటించాలని, లేని పక్షంలో సీపీిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇప్పటి వరకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలను సమీకరించి ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ(ఎం) పార్టీ మండల కమిటీ సభ్యులు టి.అంజయ్య, నాయకులు సంజీవరాజు, ధర్మారెడ్డి, కృష్ణ, సైదులు, మైసయ్య, ఆర్.లక్ష్మీ, దుర్గానాయక్ పాల్గొన్నారు.