Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పెట్రోల్ పోసి నిప్పు అంటిం చిన యజమానిపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించా లని గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జరుపుల శివనాయక్, కేతావత్ కృష్ణ నాయక్‌లు డిమాండ్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని శాయిన్‌పేట తండాకు చెందిన రమావత్ తిరుపతి నాయక్, మున్ని (26)వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు ఉన్నారన్నారు. బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చి కూకట్పల్లి బాలాజీనగర్‌లో నివాసం ఉంటూ అక్కడే ఓ అపార్టుమెంట్లో ఇంటి యజమాన్ని బన్నీ, అతని భార్య స్వాతితో పాటు వారి అమ్మ వద్ద నెలవారి పనికి నాలుగు వేలకు ఒప్పుకున్నారన్నారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఇంట్లో పని ఉందని పిలిపించుకుని పనిమనిషి మునిపై పెట్రోల్ పొసి నిప్పు అంటించి దారుణానికి పాల్పడారన్నారు. ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని, లేనిచో గిరిజన సంఘాలచే ధర్నాలు ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేతావత్ శంకర్‌నాయక్, రమావత్ చిరంజీవి నాయక్, పాత్లావత్ గోపాల్ నాయక్, కేతావత్ బోజ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.