Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
నవ తెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించిన సందర్భంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బం దులు పడుతున్న గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి తిరిగి పాఠశాలలు తెరిచే వరకు నెలకు రూ.2వేలు, 25 కిలోల బియ్యం రేషన్ షాపుల ద్వారా అందించాలని సీఎం కెసిఆర్ ప్రకటించడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రైవేటు స్కూల్స్ టీచర్స్ వెల్ఫేర్ ఫోరం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ తమ సమస్యలను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినందుకు ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రభుత్వం ఇస్తున్న ఆపత్కాల ఆర్థిక సాయాన్ని మరింత పెంచే విధంగా కృషి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలనే సీఎం కేసీిఆర్ నిర్ణయం తీసుకున్నార న్నారు. నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న కుటుంబాలకు ఎంతో లభ్ది చేకూరుతుందన్నారు. ప్రైవేటు టీచర్లకు ఆపత్కాల ఆర్థిక సాయం మరింత పెంచే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రమణ, ఉపాధ్యక్షులు రవికుమార్, ప్రధాన కార్యదర్శి నాగార్జున, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు గంగాదేవి, సబితారెడ్డి, కోశాధికారి మూర్తి, కమిటీ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.