Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మతదేహం లభ్యమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5, దేవరకొండ బస్తీలో నిర్మాణంలో ఉన్న ఒక ఎకరం బిఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెల్లార్ కొరకు తవ్విన భాగంలో భారీగా నీరు నిలిచింది. ఈ ప్రాంతంలో గత 3 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహిస్తున్న ఎండి అబ్దుల్లా (38) ఆదివారం ఉదయం యదావిధిగా విధులకు వచ్చిన అబ్దుల్లా నీటిలో తేలుతున్న మతదేహాన్ని చూసి బంజారాహిల్స్ పోలీసులకు స్థానికుల సహకారంతో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసు అధికారులు క్లూస్ టీం ఈతగాళ్ళు స్థానికుల సహకారంతో మతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.మతదేహం వ్యక్తిపై పచ్చ టీషర్టు నీలం రంగు జీన్స్ ప్యాంటు సుమారుగా(40) సంవత్సరాల పైబడి వయస్సు ఉంటుందని మతదేహాన్ని ఇంతవరకు ఎవరు గుర్తించలేక పోవడం వలన అనుమానిత మతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.