Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా ఆదివారం సూరారం డివిజన్ పరిధిలోని డాక్టర్ బి.ఆర్. ఆంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో సుభాష్‌నగర్ డివిజన్ తెలుగుతల్లినగర్లో మహాత్మ జ్యోతిరావుపూలే చిత్ర పటానికి, విగ్రహాలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్రాజులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగరాజుయాదవ్, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కొలుకుల జగన్, సీనియర్ నాయకులు సురేష్‌రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలొని షిర్డిహిల్స్, మగ్దూంనగర్ కార్పొ రేటర్ కార్యాలయం వద్ద నిర్వహిం చిన మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి వేడుకలలో టీిఆర్‌ఎస్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్ పాల్గొని మహాత్మ జ్యోతి రావు పూలే చిత్ర పటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యేసురత్నం, మల్లేష్‌గౌడ్, దాసు, పాపుల్గౌడ్, మల్లారెడ్డి, పాపిరెడ్డి, గణేష్, బసవేశ్వర్, రాములు, వెంకటేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని షిర్డి హిల్స్‌లో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర బీసీి సంక్షేమ సంఘం ఉపాధ్య క్షులు నల్లగోపుల బాబుగౌడ్ పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్, రామకృష్ణ, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షాపూర్‌నగర్ సిఐటీయూ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుక లకు సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ పాల్గొని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ సీపీఐ(ఎం) కార్యదర్శి అంజయ్య, సంజీవ రాజు, లక్ష్మీ, సైదులు, స్వాతి తదితరులు పాల్గొన్నారు.