Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అడిక్మెట్
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన బాటలో రాష్ట్ర ప్రభుత్వం కషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ద ఊరే బ్రహ్మయ్య తెలిపారు. పూలే 195వ జయంతి పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా అభివద్ధి చెందుతాయని పూలే నమ్మారన్నారు. అదేవిధంగా అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానంగా విద్యనుఅందించేందుకు కషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిద్ధాల ఐలయ్య, కురే రమేష్, గుడ్రానరం చంద్రశేఖర్, మద్దెల వినరు కుమార్, బి.యాదగిరి, పి.శేఖర్, క్యాసని అంజి, శివ వంజరి, సాయి కుమార్, పుట్టా సీతారాం, కొత్తపెళ్లి లింగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.