Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్ చిల్ల తో పాటు వివిధ ప్రాంతాలలో ఏసీపీి ఎం.సుదర్శన్, ఇన్స్పెక్టర్ శివ చంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేకం గా నిర్వహించిన మాస్క్ తప్పనిసరి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ విధిగా భావించి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్థం చేసు కొని ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగు ణంగా ప్రజా రక్షణ కొరకు చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములవుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము తప్పనిసరిగా చేయడంతో పాటు ఈ విధా నాన్ని పాటించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని వివిధ ప్రాంతాలలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారులు సోడా బండి వద్ద, వాహ నంపై వెళ్తున్న వారికి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాబోయే రంజాన్ మాసాన్ని దష్టిలో ఉంచుకొని అవగాహన సదస్సు శిబిరాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్న దశ్యాలు, సదస్సులనూ విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ ఇన్స్పెక్టర్ శివ చంద్ర ధన్యవాదాలు తెలిపారు.