Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
పారిశుద్ధ్య కార్మికులు అందరూ టీకా వేసుకోవాల్సిందే అని ప్రభుత్వం విధించిన ఆకాంక్షలకు లోబడి కార్యక్రమం కొనసాగుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ రవికాంత్ అన్నారు. సోమవారం బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ జూబ్లీహిల్స్ రాజన్న పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో హైదరాబాద్ నగర ప్రధాన వైద్య అధికారులు డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక వైద్యుల పర్యవేక్షణలో సహాయక వైద్యాధికారి డాక్టర్ రవికాంత్ గతంలో వేసుకోని చాలామంది ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా తప్పనిసరి అని ప్రభుత్వ ఆదేశాల అవసరంగా 675 మంది పారిశుధ్య కార్మికులకు టీకాలు వేయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వచ్చి వైద్యులను కలిసి వారి సహకారం తీసుకోవాలని కార్మికు లకు, సిబ్బందికి సూచించారు. వైద్యులు తెలిపిన నియమా లను టీకా వేసుకున్న వారందరూ పాటించాలని కోరారు.