Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం అధ్యక్షుడు సుంకోజు కష్ణమచారి
నవతెలంగాణ-సరూర్నగర్
రాష్ట్ర వ్యాపితంగా ఉన్న విశ్వబ్రాహ్మణ మనుమయదార్ల సంఘం ఐక్యతకు, విస్తరణకు మరింత బలాన్ని, బలగాన్ని చేకూర్చేందుకు కృషి చేస్తానని సంఘం నూతన అధ్యక్షుడు సుంకోజు కష్ణమాచారి అన్నారు. సోమవారం చంపాపేట డివిజన్ కర్మన్ఘాట్ దుర్గానగర్లో విశ్వబ్రాహ్మణ మనుమయదార్ల సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కర్మన్ ఘాట్ సామ సరస్వతి కాలనీకి చెందిన సుంకోజు కష్ణమా చారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడారు. తన మూలవాసులందరూ తనపై నమ్మకంతో తనను అధ్యక్షుని బాధ్యతలో నిలిపారని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో తమకు కేటాయించిన వాటాను తమ సంపూర్ణ అభివృద్ధికి ఖర్చు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. విశ్వబ్రాహ్మణ మను మయదార్లమని చెప్పుకునే ప్రతీ ఒక్కరు సంఘంలో సభ్యులు కావాలన్నారు. అంతేగాక రాజ్యాంగం కల్పించిన పౌర హక్కు, ఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరూ నమోదు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో తనతో పాటు మరో నలుగురు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు తెలిపారు.