Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రికార్డు స్ధాయిలో రోజుకు లక్షకు పైగా కేసులు నమోద వుతుండగా, మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగం గా సాగుతోంది. ఇక కేసులు ఎక్కువ సంఖ్యలో నమోద వుతున్న రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో తిరిగి లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతుండగా దీంతో కూలి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. కార్మికులు వెళ్ళిపోకుండా బిల్డర్లు ఆంధ్రలో వారికి సకల సదుపాయాలు కల్పిస్తా మని భరోసా ఇచ్చి ఉన్నవారిని వెళ్ళిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారం అనంతరం మళ్లీ పూర్తి లాక్డౌన్ విధిస్తారన్న భయాలతో సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్న వలస కూలీలు తిరిగి సొంత రాష్ట్రాలకు బయల్దేరుతున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ చాలా మంది నగరాలు, పట్టణాలకు వచ్చి పనిచేసుకోవడం మొదలు పెట్టనున్నట్లు అధికారులు అంచనాల ప్రకారం తెలియజేస్తున్నారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కాలనీ పరిధిలో అత్యధి కంగా నిర్మాణాలు ఆసుపత్రిలో ఇతర కార్యాలయాలు ఉండడం వలన కూలీల కొరత భారీ సంఖ్యలో ఉండ డంతో నర్సింగ్ చేసిన సిబ్బందికి రోజుకు వెయ్యి రూపా యలు ఇచ్చినా వారి సేవలను వినియోగించు కోవ డానికి ప్రయివేటు ఆస్పత్రుల యజమాన్యాలు సిద్ధమ వుతున్నాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే మహ మ్మారిని అదుపుచేయడం కష్టమవుతుందని ప్రభుత్వం మాస్కు ధరించని వారికి వెయ్యి రూపాయల జరి మానా, అవసరమైతేనే బయటికి రావడానికి సూచ నలు అమలు చేసిన సంగతి తెలిసిందే. పోలీస్ అధికా రులను పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జరిమా నాలు విధించే అధికారాన్ని కట్టబెట్టినా ప్రభుత్వంపై కొందరు సామాజికవేత్తలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. వేయి రూపాయల జరిమానా విధించే బదులు 50 రూపాయలు పెట్టి మాస్కులు పంపిణీ ఉత్తమమని ప్రభుత్వం చేతనైతే మంచి కార్యక్రమాలు చేపట్టాలని, పేదవారి నడ్డివిరిచే కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు.