Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న వద్ధుడు అదృశ్యమైన సంఘటన అంబర్ పేట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన ఎల్లయ్య (65) అంబర్‌పేట ఎంసీహెచ్ కాలనీలో తన కుటంబ సభ్యులతో కలిసి ఉంటూ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య, కుమారుడు ఈనెల 6వ తేదీన తమ స్వగ్రామానికి వెళ్లారు. ఈ నెల 7వ తేదీన ఎల్లయ్య రోజు మాదిరిగానే అపార్ట్మెంట్లో డ్యూటీకి వెళ్లాడు. అక్కడ అపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులతో వాగ్వివాదం జరిగింది. అపార్ట్ మెంట్లో పనిచేసే మేస్త్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు సాయంత్రం వచ్చి చూసేసరికి ఎల్లయ్య కనిపించలేదు. ఆయన కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు సోమవారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.