Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇకనుంచి బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణాల సమయంలో వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందేనని అల్వాల్ జీహెచ్ఎంసి శానిటేషన్ ఇన్స్పెక్టర్ జలం ధర్రెడ్డి తెలిపారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు రూ. 1000లు పెనాల్టీలు వేయడం జరి గింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహిం చాలని మాస్కులతో పాటు శానిటైజర్ తప్పని సరిగా వాడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.