Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అడ్డగుట్టలోని ఇంద్రలక్ష్మీనగర్ ఫౌండర్ లక్ష్మమ్మ మను మడు ఆర్.రాజు, టి. లక్ష్మీనారాయణ, ఎల్. వెంకటస్వామి, కె.శ్రీనివాస్, పి.లక్ష్మణ్ ఇతరులతో కలిసి మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆమె నివాసంలో బీజేపీలో చేరారు. వీరిని పార్టీలోకి సాదరంగా స్వాగతించిన కార్తీకరెడ్డి మాట్లాడుతూ నూతన చేరికలతో సికింద్రబాద్ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బండ చంద్రారెడ్డి, హంసరాజ్, రాజు గౌడ్, వీరన్న, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.