Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడారంగంలో ముందుం డాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ సంద ర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని బంధన్ ఫంక్షన్ హాల్లో జరిగిన మార్షల్ ఆర్ట్స్ కరాటే ప్రదర్శనను ఎంపీపీి ఏనుగు సుదర్శన్‌రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముళ్లి పావని జంగయ్య యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఎంపీపీి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనం నుండి విద్యతో పాటే క్రీడా రంగంలో ముందుండాలని, ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవడం మంచిదన్నారు. సమాజంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకునే శక్తిసామర్థ్యాలను కూడగట్టుకునే ప్రతి ఒక్కరు మన చుట్టు ఉన్న వారి కోసం పాటుపడాలని, అందుకు విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతో అవసరం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముళ్లి పావని జంగయ్య యాదవ్, కౌన్సిలర్లు కడుపోల్ల మల్లేష్, మేకల పద్మారావు, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ జిలాని, అన్ని జిల్లాల కరాటే విద్యార్థులు మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.