Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
జూబ్ల్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ నెంబర్ 10బి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న శివ(40)ని ఆదివారం రాత్రి తలపై రాయితో కొట్టి హత్య చేసిన సంఘటన జరిగింది. జూబ్ల్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన శివ, అతని స్నేహితులు శ్రీనివాస్, రాకేష్, డేవిడ్ నలుగురు కలిసి ఆదివారం రాత్రి మద్యం సేవించారు. అనంతరం మధ్య రాత్రి తర్వాత రాకేష్, శ్రీనివాస్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మతుడు శివ, డేవిడ్ అక్కడే నిద్రించారు. అయితే తెల్లవారుజామున రెండు ఇరవై నిమిషాలకు శ్రీనివాస్ తిరిగి వచ్చి చూడగా, మద్యం సేవించి నిద్రించిన ప్రదేశంలో తల పగిలి రక్తపుమడుగులో ఉన్న శివను గుర్తించి డయల్ 100కు కాల్ చేసి విషయం పోలీసులకు తెలిపాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు చనిపోయి ఉన్న శివ మతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, పరారీలో ఉన్న డేవిడ్ కొరకు గాలిస్తున్నారు. అన్ని కోణాలలో కేసు దర్యాప్తు చేస్తున్నామని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.