Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ చిన్న అవకాశాలను ఉపయోగించుకొని పనిచేస్తున్న ప్రయివేట్ లెక్చరర్స్ వాళ్ల వాళ్లంతా అడ్మిషన్ పెంచడం కోసం శాయశక్తుల కషిచేసిన లెక్చరర్‌కి ఉపాధి అవకాశాలు ఎదురుచూస్తూ అదే ప్రయివేట్ వ్యవస్థలో చితికిపోతున్న ప్రయివేట్ లెక్చరర్స్ జీవితాలు నేడు యాజమాన్యాలు కానీ మరియు ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలను రోడ్డు పాలు చేశాయని కట్ట శేఖర్ తెలిపారు. ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తూ గెస్ట్ లెక్చరర్స్ నుండి ప్రయివేట్ లెక్చరర్స్‌గా, ప్రయివేట్ లెక్చరర్స్ నుండి గెస్ట్ లెక్చరర్‌గా మారుతూ అవకాశాలు కోల్పోయిన లెక్చరర్స్‌ను ఎవ్వరు పట్టించుకోకుండా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ చితికిపోయే కారణం ఒకటైతే కరోనా అనేది వారి జీవితాలలో పెను విషాదాలను నింపుతున్నాయి. కానీ రోజు జీవనం గడవక కొత్త ఉపాధి అవకాశాలు వెతుక్కుంటున్నారు. జీవనాన్ని కొనసాగిస్తూ ఎలాంటి అవకాశాలు దొరకక జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రయివేట్ లెక్చరర్స్. అందరికీ ప్రభుత్వం ప్రయివేట్ టీచర్స్‌కి ఏవిధంగానైతే సహాయం అందిస్తున్నారో అదే లెక్చరర్స్కి కూడా వర్తింపజేస్తూ వారికి భరోసా కల్పించాలని, ప్రయివేట్ లెక్చరర్స్‌ని ఆదుకోవాలని ప్రయివేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ రాష్ట్ర అధ్యక్షులు కట్టా శేఖర్ ప్రభుత్వాన్ని కోరారు.