Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం మాస్క్ లేకుండా బయట తిరుగుతు న్న వ్యక్తులపై సోమవారం సాయంత్రం తార్నాకలో స్పెషల్ డ్రైవ్ ఇస్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా కేసులు బుక్ చేశారు. అందరూ విధిగా మాస్క్లు ధరించి సామాజిక దూరం పాటించాలని రమేష్ నాయక్ కోరారు. ఈ డ్రైవ్లో భాగంగా 102 మంది మాస్క్లు లేకుండా ఉండటంతో వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నర్శింగ్రావు, సిబ్బంది పాల్గొన్నారు.