Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు టీచర్లకు ప్రకటించిన కరోనా భృతికి వారం రోజులు గడువు పొడిగించాలని తెలగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ సమితి (టీపీటీఎల్ఎస్) రాష్ట్ర అధ్యక్షులు కొండ రాంబాబు కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా భృతి కోసం దరఖాస్తు చేసుకునే సమయాన్ని మరో వారం రోజు లు పొడగించాలనీ, సాయం రూ.5 వేలకు పెంచాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న కరోనా సాయాన్ని కొన్ని పాఠశాలలు ఉద్దేశపూర్వకంగా కొంతమంది టీచర్లకు అంద కుండా చేయడానికి పలు రకాలైన కారణాలు చూపి వారిని మానసికంగా వేధిస్తున్నారనీ, ఇలాంటి స్కూల్లపై విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుని ఆ పాఠశాల గుర్తింపు ను రద్దు చేయాలని కోరారు. గుర్తింపు పొందిన స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లకు మాత్రమే రూ.2వేలు, 25 కేజీల బియ్యం అందజేస్తామని ప్రకటించిన సీఎం గుర్తింపులేని పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్ల గురించి అధికారులు తర్వాత నిర్ణయం తీసుకుంటామని అనడం చూస్తుంటే ఇం దులో రాజకీయ కోణం కల్పిస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో పని చేస్తున్న లెక్చరర్లకు కూడా సాయం చేయా లనీ, విద్యా వ్యవస్థలో పని చేస్తున్న వీరంతా ఏడాది కాలం గా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిజం గా సీఎం చేస్తున్న సాయంలో రాజకీయ దురుద్దేశం లేకుం టే రాష్ట్రంలో ఉన్న మూడున్నర లక్షల మంది టీచర్లు, లెక్చరర్లకు సాయం అందేలా చూడాల్సిన బాధ్యత సీఎందే అని తెలిపారు. విద్యా వ్యవస్థలో పని చేస్తున్న అందరికీ వివక్షత లేకుండా సాయం అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వీరేందర్ నాయుడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ వైశ్య, రాష్ట్ర కార్యదర్శులు సంపత్, నాగభూషణం, అధికార ప్రతినిధి సాహెబ్ పాల్గొన్నారు.