Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటా రని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సొమవారం కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలో 15 స్వచ్ఛ ఆటోలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు రెండు చొప్పున స్వచ్ఛ ఆటోలను ప్రారంభించినట్టు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాదే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం తో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూ.వేల కోట్లతో హైద రాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నారన్నారు. స్వచ్ఛ ఆటోల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి వేయాలని సూచించారు. ఈ కార్య క్రమంలో జోనల్ కమిషనర్ మమత, డీసీ రవికుమార్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.